అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య ||
అంతటికి ఏలికైన ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య సంతసాన చెలువొందే సనకసనందనాదు- లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య ||
బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు హరిమీద విన్నవించె అన్నమయ్య విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల అరసి తెలిపినాడు అన్నమయ్య ||
అందమైన రామానుజ ఆచార్యమతమును అందుకొని నిలచినాడు అన్నమయ్య విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||